ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే గెలుపుగుర్రాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిసారించింది. స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ- పీఈసీ ప్రతిపాదనలపై ఇప్పటికే సర్వే పూర్తైనట్లు తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలపై మరింత స్పీడ్ పెంచిన తెలంగాణ కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. మొన్నటివరకు సీడబ్ల్యూసీ సమావేశం, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తూ నేతలు బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల సమావేశాలు ముగియడం, బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. బుధ, గురువారాల్లో (సెప్టెంబర్ 20, 21 తేదీల్లో) ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది.ఒకరి కంటే ఎక్కువమంది పోటీ లేని నియోజకవర్గాలకు ముందుగా అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇందులో భాగంగా మొత్తం 119 స్థానాల్లో ముందుగా 30 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఫిక్స్ చేసిన అనంతరం అభ్యర్థుల జాబితాను సీఈసీకి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది.మరోవైపు.. రాష్ట్రంలో ఎన్నికలకు ఇప్పటికే ఈసీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దీని వల్ల ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుందని, అభ్యర్థులు కూడా ప్రజల్లోకి ఇప్పటి నుంచే వెళ్లడం ద్వారా సానుకూలత లభిస్తుందని భావిస్తోంది.
స్క్రీనింగ్ కమిటీ సింగిల్ నేమ్ తో కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే జాబితా ఇదే.1. రేవంత్ రెడ్డి (కొడంగల్)2. ఉత్తమ్ కుమార్ రెడ్డి ( హుజూర్ నగర్ )3. పద్మావతి (కోదాడ )4. భట్టి విక్రమార్క (మధిర )5. శ్రీధర్ బాబు (మంథని )6. జీవన్ రెడ్డి (జగిత్యాల)7. సీతక్క ( ములుగు)8. పొడెం వీరయ్య(భద్రాచలం )9. జగ్గారెడ్డి (సంగారెడ్డి )10. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ )11. సంపత్ కుమార్ (అలంపూర్ )12. కుందూరు జైవీర్ రెడ్డి (నాగార్జునసాగర్)13. షబ్బీర్ అలీ (కామారెడ్డి )14. తుమ్మల నాగేశ్వరరావు (పాలేరు )15. పొంగులేటి శ్రీనివాసరెడ్డి (కొత్తగూడెం )16. రామ్మోహన్ రెడ్డి (పరిగి )17. గడ్డం ప్రసాద్ కుమార్ (వికారాబాద్ )18. చిగురింత పారిజాత (మహేశ్వరం )19. బీర్ల ఐలయ్య (ఆలేరు )20. రోహిన్ రెడ్డి (ఖైరతాబాద్ )21. వడ్త్య రమేష్ నాయక్ (దేవరకొండ )22. ఆది శ్రీనివాస్ (వేముల వాడ )23. లక్ష్మణ్ (ధర్మపురి )24. అనిరుద్ రెడ్డి (జడ్చర్ల )25. బల్మూర్ వెంకట్ (హుజూరాబాద్ )26. ఫిరోజ్ ఖాన్ (నాంపల్లి )27. జువ్వాడి నర్సింగ్ రావు (కోరుట్ల)28. వంశీకృష్ణ (అచ్చంపేట )29. ఏ. చంద్రశేఖర్ (జహీరాబాద్ )30. దామోదర రాజనర్సింహ (ఆందోల్ )31 ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల )32. జూపల్లి కృష్ణారావు ( కొల్లాపూర్ )33. కంది శ్రీనివాస్ రెడ్డి (ఆదిలాబాద్ )34. కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్ )35. గండ్ర సత్యనారాయణ (భూపాల పల్లి )