ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 24 :
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన గురువారం నర్సాపూర్ (జి) మండలంలో జరిగింది. స్థానిక ఎస్సై సాయి కిరణ్ తెలిపిన వివరాల మేరకు దొంగుర్గాం గ్రామానికి చెందిన ధని విజయ్ (51) తన వ్యవసాయ క్షేత్రంలో మోటర్లు పనిచేయడం లేదని ఈనెల 11 సాయంత్రం సమయంలో జంగిపల్లి చిన్నయ్య వ్యవసాయ పొలంలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మోటర్ పైపులను చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా బుధవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళగా గురువారం తెల్లవారుజామున మృతి చెందాడని తెలిపారు. మృతుని తమ్ముడు వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు.