*1990-91 పదవ, తరగతి విద్యార్థిని, విద్యార్దులు

చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకున్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాల కమలాపూర్ స్నేహితులు

హన్మకొండ జిల్లా ఓరుగల్లు9న్యూస్ ప్రతినిధి:
కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలోని సాధన విలేజ్ రిసార్ట్ లో అత్యంత వైభవోపేతంగా కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధిని, విద్యార్ధులు 1990 – 91 బ్యాచ్ వారు భాషబోయిన దేవేందర్ గౌడ్, దాసి ఉషాకాంత్, నద్దునూరి భద్రయ్య, దుబాయ్ సాంబయ్యల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల తరువాత దాదాపుగా 60 మంది స్నేహితులు, స్నేహితురాళ్ళు కలిసి ఒక కుటుంబంలా ఉండటం, ఒకరి కష్టసుఖాలు పంచుకోవడం, తల్లిదండ్రుల తర్వాత దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం స్నేహితుడు అని స్నేహబంధంతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో విష్ణు, సోమ రాజు, వెంకన్న, సురేష్, జ్యోతి, రాములు, చంద్రశేఖర్, అనిత, ప్రొఫెసర్ సమ్మయ్య, రాజమొగిలి, శ్రీవాణి, సర్వర్ తదితరులు పాల్గొన్నారు