ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. ఒకవేళ మహిళా రిజర్వేషన్ వల్ల తన ఎమ్మెల్యే సీటు (సిరిసిల్ల) పోయినా బాధపడనన్న కేటీఆర్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలయ్యేదాక ఎదురుచూడటం ఎందుకు..?ఈ ఎన్నికల్లోనే సీటు త్యాగం చేసి ఒక మహిళకు అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు..? అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించండి అని మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు వైఎస్ షర్మిల. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపండి అని కోరారు.శ్రీకాంత చారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవి ఇవ్వలేదని, కవిత ఓడిపోతే మాత్రం కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ట్వీట్ చేశారు. దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయండి అని సవాల్ విసిరారు.
దమ్ముంటే మీ సీట్లను త్యాగం చేయండి : కేటీఆర్కు షర్మిల సవాల్-ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES