ఐ పెన్సిల్ డ్రైగా ఉంటే దాన్ని హ్యాండ్ డ్రైయర్ మీద కొంచెం సేపు పెట్టాలి. అప్పుడది మెత్తబడి, మేకప్ వేసుకోవడం ఈజీ అవుతుంది.
జుట్టు జిడ్డుగా ఉంటే డ్రై షాంపూలతో తలస్నానం చేయాలి.
గోళ్లకి రెగ్యులర్ నెయిల్ పాలిష్ బదులు జెల్ నెయిల్ పాలిష్ వాడాలి. ఒక్కోసారి నెయిల్ పాలిష్ డ్రైగా ఉండి, గోళ్లకి సరిగా అంటుకోదు.
అందుకే దాన్ని ఫ్రిజ్లో పావుగంట సేపు ఉంచాలి. ఆ తర్వాత నెయిల్ పాలిష్ వేసుకుంటే బాగా వస్తుంది.
లిఫ్టిక్ ఎక్కువ సేపు ఉండాలంటే పెదాలపై ముందుగా ఫేస్ పౌడర్ పూయాలి. తర్వాత మ్యాటే బేస్డ్ లిఫ్టిక్ వేసుకోవాలి.
చెక్కిళ్లకి చీక్ టింట్స్ వాడాలి.
హెయిర్ సీరమ్ బాటిల్ ని ఎప్పుడూ క్యారీ చేస్తే… బయటికెళ్లినప్పుడు వెంట్రుకలు డ్రైగా అనిపించినప్పుడు వాడొచ్చు.