ఇండ్ల స్థలాల పరిష్కారంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సన్మానం
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి హనుమకొండ : సుధీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిండంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ, సమస్యల సాధనకు చర్యలు తీసుకుంటానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా వరంగల్ ప్రెస్ క్లబ్ కు వచ్చిన ఆయనకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ , టీయూడబ్ల్యూజేే (ఐజేయు) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా వరంగల్ జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇండ్ల స్థలాలు, జర్నలిస్టులకు అక్రిడేషన్స్ తో పాటు హెల్త్ కార్డులు అందజేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని, చాలా చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. వరంగల్ జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయమై త్వరలోనే స్థానిక శాసనసభ్యులు, మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్, టీయూడబ్ల్యూజేే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచందర్ , దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్, పి. వేణు మాధవరావు,మరుపట్ల జయపాల్ కరెస్పాండంట్, ప్రెస్ క్లబ్, యూనియన్ ల నాయకులు,సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.