జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హస్పిటల్ నందు కంటి ఆపరేషన్ థియేటర్ ను గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆధునిక కంటి ఆపరేషన్ థియేటర్ ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సౌకర్యం లభించడం వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, సమయం, ఖర్చు ఆదా అవుతుందని, కంటి సమస్యలకు సంబంధించిన సమస్యలను ఇక్కడే పరిష్కరించుకోవచని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని విభాగాల వైద్యులు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన ఉత్తమ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోరారు.
గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, కంటి ఆపరేషన్ థియేటర్ ప్రారంభం ద్వారా ప్రజలు స్థానికంగానే అత్యుత్తమ వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిడెంట్ వినోద్ కుమార్, ఏఈ రహీముద్దీన్,
ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.