ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి:గురువారం ములుగు రోడ్ లో ఉన్న లాల్ బహదూర్ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా మేధావులకు నిలయమని అన్నారు. శ్రీధర్ బాబు ముందుగా కళాశాలలో ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి పూలమాల వేశారు.
అనంతరం కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ ముగింపు వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్బీ కళాశాలను స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపిక చేస్తామన్నారు. ఎల్ బి కళాశాల విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఇంకో 50 సంవత్సరాల పాటు విద్య అందిస్తుందని అన్నారు. ఈ కళాశాల నుంచి ఎందరో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఇతర దేశాల్లో స్థిరపడ్డారని అన్నారు. ఈ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి విద్యకు కావలసిన అన్ని రకాల ప్రోత్సాహం సీఎం అందిస్తారన్నారు.
ప్రభుత్వ పరంగా రాబోయే కాలంలో ఎల్బీ కళాశాల లాంటి అనేక కళాశాలలు స్థాపించి విద్యార్థులకు మంచి బోధన అందిస్తామని అన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యంతో చదివి మన జిల్లాకు,రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన రాజేందర్రెడ్డి ,ఎల్బి కళాశాల చైర్మన్ కే నిరంజన్,సెక్రెటరీ కరస్పాండెంట్ ఈ రాజేంద్ర కుమార్, జాయింట్ సెక్రెటరీ రమేష్, ట్రెజరర్ ఆనంద్ కుమార్ బొల్లా పాల్గొన్నారు.