•ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఎదగాలి
•తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవించాలి
జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం
ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని టి.జి. రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ బాలుర లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి హాస్టల్లో బస చేసి,ఉదయం విద్యార్థులతో కలిసి దినచర్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.హాస్టల్లో ఉదయం విద్యార్థులతో పరస్పర సంభాషణ నిర్వహించి,తరగతి గదులు,మెనూ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఉదయం ప్రార్థనలో పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,, జీవితంలో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణ మరియు కష్టపడే తత్వం తమపై పూర్తి నమ్మకం కలిగి ఉండాలని అన్నారు. పరీక్షలో మంచి ఫలితాలు సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు.హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఈ రోజుల్లో చాలా అవసరమని సూచించారు. చదువుకోవడంతో పాటు దాని అర్థం,ప్రాధాన్యతను తెలుసుకోవాలని, భవిష్యత్తులో ఆ విషయాలు ఎలా ఉపయోగపడతాయో గుర్తించాలని సూచించారు.మీ సీనియర్లు గొప్ప స్థాయిలో ఉన్నారని వారిలా మీరు ఎదగాలన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు.
పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు లాజికల్ ఆలోచనతో చదివి, రివిజన్,మోడల్ పేపర్ల ద్వారా ప్రాక్టీస్ చేయాలన్నారు.ఉదయం, రాత్రి స్టడీ అవర్స్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ సంవత్సరం పాఠశాలలో 10/10 జీపీఏతో కనీసం ఐదుగురు విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలన్నారు. మంచి ఫలితాలు సాధించిన వారికి స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఘనంగా సన్మానిస్తానని అన్నారు. విద్యతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యమని ప్రతి రోజూ విద్యార్థులందరూ వ్యాయామం చేయాలని సూచించారు.పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. తల్లిదండ్రుల కృషిని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని, ప్రతి ఒక్కరూ రోల్ మోడల్‌గా నిలవాలని కలెక్టర్ హితబోధ చేశారు.