ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 10 :
Nrml : నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని బసంన్ చెరువు, ఊర చెరువు కట్టలకు ఇరువైపులా తుమ్మ పొదలు, బొబ్బిలి ముళ్ళ తో నిండిపోయాయి. దీంతో అటువైపుగా వెళ్లే రైతులు, పశువుల కాపరులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెరువు కట్టలపై పెరిగిన ముండ్ల పొదలను తొలగించాలని మంగళవారం గ్రామస్తులు కోరారు.