08.12.2024 రోజున రాత్రి సమయం లో ముటాపూర్ గ్రామానికి చెందినా గుర్రం వెంకవ్వ తన కుమారుడు అయిన గుర్రం ముత్యం మద్యం సేవించడానికి డబ్బులు అడగగా ఆమె ఇవ్వక పోవడం తో, గుర్రం ముత్యం ఆమె దగ్గర ఉన్న బీరువా తాళం తీసుకొని అందులో ఉన్న డబ్బులు తీసుకుంటూ అందులోని అప్పు పత్రాలను చింపుతుండగా, గుర్రం వెంకవ్వ అడ్డుపడగా అక్కడే ఉన్న గొడ్డలి తో గుర్రం ముత్యం తన తల్లి పై దాడి చేయగా ఆమెకు తలకు , శరీర ఇతర భాగాలకు రక్త గాయాలు అయినవి, అదే సమయం లో గుర్రం ముత్యం కుమారుడు (గుర్రం మనిదిప్) తన ఇంటికి వచ్చి నానమ్మ ను ఎందుకు కొట్టుతున్నావ్ అని అడగగా
ఇది మా తల్లి, కొడుకు ల పంచాయతి నీకెందుకు అని కుమారుడిని తో తండ్రి గుర్రం ముత్యం తిడుతూ గొడవ పడ్డాడు. అప్పుడు గుర్రం మనిదిప్ తన నాన్న ను చంపుటకు ఇదే మంచి అవకాశం అని అనుకోని, గుర్రం ముత్యం యొక్క గొంతు పట్టి గట్టిగ పిసికినాను, అతను కింద పడిపోగా గుర్రం మనిదిప్ తన ఇంటి లో ఉన్న తన అమ్మ చీర తీసుకొని అతని తండ్రి మెడ చుట్టూ బిగించి చంపాలని గట్టిగ లాగినాడు గుర్రం ముత్యం కొద్దిసేపు గిల గిల కొట్టుకొని మరణించినాడు. గుర్రం మనిదిప్ తన తండ్రిని ఇంట్లో పడుకోబెట్టి అతని పై ఒక బ్లాంకెట్ కప్పినాడు తర్వాత గుర్రం మనిదిప్ తన నానమ్మ ను దేవేందర్ రెడ్డి హాస్పిటల్ కు తీసుకొని వచ్చి తన నానమ్మ ప్రమాదవశాత్తు బాత్రుం నందు పడినది అని చెప్పి అడ్మిట్ చేసి పారిపొయడు.
గుర్రం ముత్యం వరుసకు అన్న అయినటువంటి గుర్రం రాజేశ్వర్ వెంటనే నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లయింట్ ఇవ్వగా . జి.లింబాద్రి ఎస్ఐ కేసు నమోదు చేసి. తక్షణమే స్పందించిన నిర్మల్ రూరల్ CI రామ కృష్ణ, SI లింబాద్రి లు తన సిబ్బంది తో చాకచక్యం నేరస్తుడిని హత్య జరిగిన 24 గంటల లో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
ఇట్టి కేసులో చురుకుగా బాధ్యత నిర్వర్తించిన ఇన్స్పెక్టర్ రామ కృష్ణ, ఎస్ఐ లింబాద్రి , సిబ్బంది నీ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ అభినందించారు.