తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు 2023 నవంబర్ 23 గురువారం రోజున దాదాపు ఆరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, తెన్కాసి మరియు పుదుకోట్టై జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. కాగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల రానున్న ఐదు రోజుల పాటు (నవంబర్ 20 నుంచి నవంబర్ 24 వరకు) ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తమిళనాడులో భారీ వర్షాలు:ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES