Monday, December 23, 2024

గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం.-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం సృష్టించింది. కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్లు వేధించినట్లు తెలుస్తోంది..దీంతో ప్రిన్సిపల్‌తో పాటు జాతీయ మెడికల్ కమిషన్‌కు విద్యార్థిని ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ ర్యాగింగ్ చేయగా ఇలాగే ఫిర్యాదు వెళ్లింది. మెడికల్ కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలతో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మళ్లీ ఈ ఏడాది కూడా ర్యాగింగ్ పునరావృతం కావడం గమనార్హం. కాగా, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెల రోజుల క్రితమే తరగతులు మొదలయ్యాయి. ఈలోపే ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోవటం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular