ఓరుగల్లు9నేషనల్ టీవీ :భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో 25 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. సోమవారం వరకు రద్దు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. విజయవాడ–తెనాలి, విజయవాడ–గుంటూరు, విజయవాడ–కాకినాడ పోర్ట్, రేపల్లి–-తెనాలి, గుడివాడ-–మచిలీపట్నం, భీమవరం–నిడదవోలు, నర్సాపూర్-–గుంటూరు, గుంటూరు-–రేపల్లె, మచిలీపట్నం-–విజయవాడ, ఒంగో లు–విజయవాడ మధ్య నడుస్తున్న రైళ్లను రద్దు చేసినట్టు వివరించారు. పలు ప్రధాన రైలు కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
భారీ వర్షాల కారణంగా రైళ్లు రద్దు:ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES