ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి విజయవాడ: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో విజయవాడ’ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు..విద్యార్థుల ఆందోళన దృష్ట్యా వివిధ జిల్లాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ముందస్తు అరెస్టులు చేశారు.హాస్టల్ మెస్ ఛార్జీలు ₹3 వేలకు పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. అలాగే ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రోడ్డెక్కిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్.-ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES