Wednesday, July 16, 2025

గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ వల..!!

ఉపాధ్యాయులకు అడ్మిషన్ల పేరిట ప్రత్యేక టార్గెట్… విద్యార్థుల కోసం అన్వేషణ…

విద్యార్థుల ఇళ్ల వద్ద పీఆర్వోల హడావిడి

విద్యార్థుల తల్లిదం డ్రులకు పదేపదే ఫోన్లు.. మెసేజ్లు

జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణ కరువు..

గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ వల..!!

ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 17 :

ఇంకా విద్యా సంవత్సరం ముగియనే లేదు.. సెలవు లు ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ నిర్మల్ జిల్లాలో నారాయణ . శ్రీ చైతన్య, ఆల్ఫోర్స్, ఎస్ అర్ తో పాటు హైదరాబాద్ కు చెందిన కొన్ని కార్పొరేట్ సంస్థలు, పాఠశాలలతో పాటు కాలేజీలు కూడా ఈసారి కొత్తగా అడ్మిషన్లు ప్రారంభించాయి. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశాల వేట అప్పుడే మొదలైంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మా పాఠశాలలో అడ్మిషన్ చేసుకోండి అని ఫోన్లో వాయించేస్తున్నారు. పీర్వోలు విద్యార్థుల చిరునామా లు పట్టుకుని నేరు గా ఇళ్ళకు వెళ్ళి తల్లిదం డ్రులతో ఒప్పందాలు చేసు కుం టున్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలు వచ్చే విద్యాసంవ త్సరం ప్రవేశాల కోసం పడరానిపాట్లు పడుతు న్నారు. జిల్లాలో విద్యా ర్థుల కోసం కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు వేట ప్రారంభించాయి. పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల పీఆర్వోలు అడ్మిషన్ల కోసం రంగంలోకి దిగారు. విద్యా ర్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి కాల్స్ చేస్తూ అడ్మిషన్ల కోసం పదే పదే విద్యార్థుల తల్లిదం డ్రులకు అడుగుతున్నారు. మరికొంతమంది పీఆర్వోలు నేరుగా విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి అడ్మిషన్లకు ఒప్పందాలు చేసుకుం టున్నారు. ముందుగా అడ్మిషన్ చేసుకుంటేరాయితీలు.. అడ్మిషన్ల వేట షురూ! హలో నమస్కారమండి మా పాఠశాలలో మీ పిల్లల కు ముందుగానే ఇప్పుడు అడ్మిషన్ చేసుకుంటే… భారీ డిస్కౌంట్ ఉంది.. ఈ అవకాశాన్ని చేజారు చేసు కోకండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను కార్పొరేట్ పాఠశాలలు బురిడీ కొట్టి స్తున్నాయి. టక్కు టమారా విద్యలను ప్రదర్శిస్తున్నాయి. అంతేకాకుండా ముందుగా బుక్ చేసుకో కుంటే ఫీజులు పెరుగుతా యని, సీట్లు దొరకవని భయ పెడుతున్నారు. దీం తో తల్లిదండ్రులు ఏమి చేయాలో తోచక సతమతమవుతున్నారు. కరపత్రాలు, ప్రకటనలతో మాయ చేస్తుంద్రు కార్పోరేట్ పాఠశాలల పీఆ ర్వోలను నియమించుకుని అడ్మిషన్ల కోసం గాలింపు

School

FEES

ప్రకటనల పేరిట తల్లిదండ్రులను మాయలో పడవే స్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాళల్లో చదవే విద్యార్థుల జాబితా తీసు కుని మరీ మా పాఠశాలల్లో మీ పిల్లలకు మంచి ర్యాం కులువస్తాయంటూ నమ్మబలుకుతున్నారు. ముం దుకు దరఖాస్తు చేసుకుంటే ఫీజుల్లో రాయితీలంటూ నమ్మిస్తున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కార్పోరేట్ పాఠశాలల వేధింపులు తప్పడంలేదు. విద్యా సంవత్సరం ముగియక ముందే విద్యావ్యాపారా నికి తెరతీశాయి. అక్రమ అడ్మిషన్లకు తెరలేపి భారీ మొత్తంలో ఫీజులు దండు కుంటున్నా విద్యాశాఖ పర్యవేక్షించం లేదనే ఆరో పణలు వస్తున్నాయి. అడ్మిషన్ల పేరిట ఉపాధ్యాయులకు ప్రత్యేక టార్గెట్ ..జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ల పేరిట ఉపాధ్యాయులకు ప్రత్యేక టార్గెట్ విధిస్తున్నారు. పిల్లలను అడ్మిషన్ చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు విధించడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. తప్పనిసరి పరిస్థి తుల్లో అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులుతిప్పలు అన్ని ఇన్ని కావు. కార్పొ రేట్ పాఠశాలలు అడ్మిషన్ల కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. అడ్మిషన్ల కోసం ప్రత్యేక కసరత్తు.. జిల్లాలోని విద్యార్థుల అడ్రస్లు, ఫోన్ నంబర్లు, కన్స ల్టెన్సీలు, ప్రైవేటు పాఠశాలల పీఆర్వోలు సేకరించాయి. అడ్మిషన్ల ప్రచారానికి పకడ్బందీగా శ్రీకారం చుట్టాయి. విద్యార్థుల తల్లిదండ్రులపై అడ్మిషన్ల కోసం ఒత్తిడి పెంచి ఒక్కో విద్యార్థిపై అడ్వాన్సు తీసుకుంటున్నారు. అడ్మిషన్లు సేకరించిన పీఆర్వోకు ఒక్కో విద్యార్థిపై రూ.10,000 వేల నుంచి రూ.15,000 వేల వరకు కమీషన్ అందు తున్నట్లు గుసగుసలు విని పిస్తున్నాయి. ఇంత జరు గుతున్న జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. ప్రవేట్ పాఠశాల లలో ఏ మేరకు నిబంధ నలను పాటిస్తున్నారో జిల్లా విద్యాశాఖ ఎప్పటి కప్పు డు పూర్తి స్థాయిలో పర్య వేక్షణ చేయాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular