ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వం సిద్ధమైంది.. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరుగుతాయని ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్లు ఈవో భ్రమరాంభ తెలిపారు. వివిధ దేవాలయాల్లో పనిచేసే 200 మందిని దసరా నవరాత్రిళ్ల సమయంలో విజయవాడ దుర్గ గుడిలో వినియోగించుకుంటామన్నారు. మరికొంత మందిని పది రోజులకు కాంటాక్ట్ పద్దతిన నియమిస్తామన్నారు. అక్టోబర్ 20 వ తేదీన ఆంధ్రప్రడేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దసరా నవరాత్రిళ్ల సమయంలో వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవతాయని ఈవో భ్రమరాంభ తెలిపారు, ప్రతి సంవత్సరం మాదిరిగా ఐదు వరుసలు ఏర్పాటు చేయడంతో పాటు… కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారన్నారు. …జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు.. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయి..
అక్టోబర్ 15 నుంచి దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు-ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES