ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: -ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అన్ని వర్గాల ప్రజల సమగ్ర సమచార సేకరణ చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు.బుధవారం హైదరాబాద్ నుండి అన్ని వర్గాల సమగ్ర కుటుంబ సమాచార సేకరణపై ఉమ్మడి జిల్లాల పరిధిలో నిర్వహించనున్న ప్రజాభి సేకరణపై జిల్లాల కలెక్టర్
లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వరంగల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా
పాల్గొన్నారు.ఈ సమీక్షలో అన్ని వర్గాల కుటుంబ సమగ్ర సమాచార ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించడానికి నవంబర్ 2వ తేదీన హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ వర్గాల ప్రజల నుండి గణనపై విజ్ఞాపనలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.ఈ ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే అన్ని అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని, కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియలో ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితి గతులపై సమగ్ర సమచారం సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లకు ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, నిష్పక్షపాతంగా సర్వే పూర్తి చేయాలని సూచించారు.
వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ
అన్ని కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై నవంబర్ 2వ తేదీన హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమిషన చైర్మన్ నిరంజన్ నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే విధంగా ప్రజా ప్రతినిధులకు, మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.