Friday, November 15, 2024

ఓరుగల్లులో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ : మంత్రి కిషన్ రెడ్డి

ఓరుగల్లు9నేషనల్ టీవీ :దేశంలోనే సౌత్ సెంట్రల్ రైల్వేలో పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్ లైన్ లు ఎలక్ట్రిఫికేషన్ పరిధిలో జరగుతున్ననాయని ఆయన తెలిపారు. రైల్ నిలయంలో ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో సమావేశమైయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘనందన్ రావు, డీకే అరుణ లు పాల్గొన్నారు.

వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ త్వరలో ఏర్పాటు కానుందని మినిస్టర్ కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజన్లు తయారు చేయాలనేదే కేంద్ర ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీలు ఆయా నియోకవర్గాల పరిధిలో జరుగుతున్న పనులు, చేపట్టాల్సిన రైల్వే నిర్మాణాల పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు వందే భారత్ రైళ్ల సంఖ్యను రానున్న రోజుల్లో పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కిషన్ చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 రైల్వే స్టేషన్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ రూ.430 కోట్లతో పూర్తయ్యిందన్నారు. ఎంఎంటీఎస్ లైన్ ప్రస్తుతం గట్కేసర్ వరకు ఉంది. దాన్ని రాయగిరి, యాదాద్రి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఏడాది రూ.6వేల కోట్ల బడ్జెట్ సాంక్షన్ అయ్యిందని ఆయన తెలిపారు. ఆన్ గోయింగ్ వర్క్ జరుగుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular