ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 25:
నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2003-04లో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో స్థిర పడిన పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి 20 యేళ్ల నాటి మరపురాని మధురమైన సంఘటనలు, గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.