ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 3:
నిర్మాల్ : స్థానిక జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆల్ ఫోర్స్ ఆవిష్కార్ కార్యక్రమాన్ని నిర్మల్ లోని స్థానిక సిటీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న కలలను ఇలాంటి కార్యక్రమాలు బయటకు వ్యక్తపరుస్తాయని, విద్యార్థులు జీవితంలో కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని లక్ష్యాన్ని అధిరోహించాలని విద్యార్థులకు తెలియజేశారు. గత సంవత్సరం టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిల్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
నృత్యం చేస్తున్న విద్యార్థినిలు