ఓరుగల్లు 9 నేషనల్ టీవి ప్రతినిధి: సంగెం మండలంలోని షాపూర్. తీగరాజుపల్లి కుంటపల్లి సంగెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో 6 గ్యారెంటీ పథకాలు చెప్పుతున్నరని,కానీ కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని,నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక పక్క నియోజకవర్గం నుండి అరువు తెచ్చుకున్నారని,తెచ్చుకున్న అరువు మళ్ళీ వాపస్ పోతారాని,మీకు ఎల్లప్పుడూ గత 15 ఏండ్ల గా అండగా ఉన్నాని,నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మరోసారి ఆశీర్వదిస్తే కేసీఆర్. సహకారంతో అభివృద్ధి చేస్తామని,పేదవారికి గృహలక్ష్మీ పథకం ద్వారా ఎన్నికల అనంతరం ప్రతి ఆడ బిడ్డ అకౌంట్ లో డబ్బులు వేస్తామని అన్నారు..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో నర్సంపేట లో రెండు సార్లు ఓడిపోయి, పచ్చిమ నియోజకవర్గంకు వచ్చారని,అక్కడ ఆ ప్రాంత ప్రజలు తరిమికొట్టితే నర్సంపేట మళ్ళీ వాపస్ పోయాడని,ఎన్నికలు రాగానే మళ్ళీ మన నియోజకవర్గంకు వచ్చారని అన్నారు.అంతకుముందు తాము గెలిచిన నియోజకవర్గాల్లో ఏమి చేశారో చెప్పాలాని,ఇక్కడకు వచ్చి ఏమి చేస్తారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.గత పదేండ్లుగా నేను చేసిన ప్రగతిని చూసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..