ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి : వరంగల్ జిల్లా సంగెం మండలంలోని నల్లబెల్లి గ్రామనికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఐ రిటైర్డ్ మామిడాల మహేందర్ గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించారు. మహేందర్ భౌతిక దేహానికి పరకాల నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆముదాల మల్లేష్ గౌడ్ ప్రగాఢ సానుభూతి నివాళులర్పించారు. దుఃఖ సముద్రంలో ఉన్న స్వేరోస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రవీణ్ మామిడాల ఓదార్చారు. మహేందర్ యొక్క త్యాగ విలువలు గుర్తుకు చేసి బహుజన సమాజ్ పార్టీకి తాను చేసిన సేవను చెప్పుతూ ,తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరుగు ఎన్నికలలో బీఎస్పీ అధికారంలోకి వస్తుంది. ఒక బహుజన బిడ్డ అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం గర్వంగా ఉంది. ఒక దళిత ఉన్నత స్థాయి అధికారులను సహితం పరకాల నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దూషించడం సిగ్గుచేటు, ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. పేద బడుగు బలహీనత వర్గాలకు చెందిన గిరిజన అమ్మాయి మలవత్ పూర్ణ ను ఎవరెస్టు శిఖరం ఎక్కించారు. కొడవలి పట్టిన చేతులు కోడింగ్ భాషను నేర్వాలి,డప్పులు కొట్టే చేతులు డాలర్లు సంపాదించాలి. మా ప్రభుత్వము ప్రతి ఒక్క పేద బిడ్డను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తామని నిరుద్యోగం అనేది మా ప్రభుత్వంలో ఉండదు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు శనగరపు రాజు, ప్రధాన కార్యదర్శి ఒంటేరు చక్రి పరకాల, నియోజకవర్గం బిఎస్పి అధ్యక్షులు అమ్మ ఒడి శ్రీనివాస్, వీరభద్రయ్య,వీరేశం,రాజు, మన్సూర్ అలీ, మహేందర్, ప్రభాకర్ ,రాజు ,ప్రవీణ్ కుమార్ స్వేరో మరియు తదితరులు పాల్గొన్నారు
మహేందర్ కు నివాళి అర్పించిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
RELATED ARTICLES