వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షులు బొమ్మాల శంకర్
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి తెలంగాణ మాల మహానాడు సభకు గీసుకొండ,సంగెం మండల జరిగిన సభకు అధ్యక్షులు బల్సుకూరి రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మాల మహానాడు వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షులు బొమ్మాల శంకర్ మాట్లాడుతూఅన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న మాల మాదిగ ల మధ్య చిచ్చు పెట్టి కుల,మత,రాజకీయాలకు తెరలేపుతున్న భారతీయ జనతా పార్టీకి , డా. బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చినటువంటి వజ్రాయుధం ఓటు హక్కు ,అలాంటి ఓటు ద్వార బిజెపి కి ప్రతీ ఒక్క మాల బిడ్డ మన ఓటు తో తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది, కాబట్టి కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న వారిని ప్రతీ ఒక్కరూ గ్రామాలలో అడుగు పెట్టకుండా వారిని తరిమి కొట్టాలి అదేవిధంగా కొంత వారి స్వార్థ స్వలాభల కోసం కులాన్ని అడ్డుపెట్టుకొని బిజెపి కి కొమ్ము కాస్తున్న కొందరు వ్యక్తులను ఇక నుండి ,ఎవ్వరూ కూడా అలాంటి వారిని నమ్మొద్దు. అని తెలుపుతున్నారు.ఈ కార్యక్రమం లో మాల సీనియర్ రాష్ట్ర నాయకులు తుప్పరి రంజిత్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మండల శ్రీనివాస్, కమిటి బాధ్యులు నవిండ్ల రాజు , బత్తుల నాగరాజు చిన్న మహేందర్ బందెల పృధ్వీ రాజు, బందేల దీపక్,ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.