బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన యువకులు,కార్యకర్తలు
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి : వరంగల్ జిల్లా సంగెం మండలం బాల్ నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని తోట్ల తండాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ 30మంది యువకులు,కార్యకర్తలు ఆ పార్టీ నీ వీడి మాజీ సర్పంచ్ కొట్టం సంపత్,జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు బాధవత్ నర్సింహా నాయక్,గ్రామ పార్టీ అధ్యక్షులు ఏడకుల సంపత్ ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు,వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి సాధారంగా ఆహ్వానించారు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది అని స్పష్టం చేశారు.ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో రూ.500 కే వంటగ్యాస్ సిలిండర్, ఆర్టిసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలను ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.పేద ప్రజల సంక్షేమం పట్ల ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలను గుర్తించి అంత్యోదయ రేషన్ కార్డులను అందజేసి 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు,ఇప్పుడున్న ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక అంత్యోదయ రేషన్ కార్డులు కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హులైన వారిని గుర్తించి కుటుంబంలో ఒకరికైనా పెన్షన్ అందించిన పాపాన పోలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.బీసీలకు లక్ష సాయం అని ప్రకటించిన ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న బీసీలకు ఆన్లైన్లో సర్వర్ డౌన్ అని చెప్పి తహాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని అన్నారు.నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు మూడు రూపాయలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు,గ్రూప్ వన్ ,గ్రూప్ టు,గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు ప్రకటించిన ప్రభుత్వం లీకేజీల పేరుతో వాటిని రద్దుచేసి నిరుద్యోగులను గోసపెడుతోందని తీవ్రంగా మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి సంక్షేమ పాలన దిశగా ముందుకు సాగాలని రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు