. బి.ఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు..
ఓరుగల్లు 9 నేషనల్ టీవీ ప్రతినిధి: వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ గ్రామ అధ్యక్షులు పుల్ల ఎల్లయ్య 50 మంది కార్యకర్తలతో బి.ఆర్.ఎస్.నాయకులు, మండల రైతుబందు కన్వీనర్ కందగట్ల నరహరి ఆధ్వర్యంలో పరకాల బి.ఆర్.ఎస్. అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరారు.వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నారని,రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు.పార్టీలో చేరిన వారిలో..పార్టీ ఉపాధ్యక్షులు చిర్ర సునీల్, పుల్ల సతీష్, పుల్ల సంతోష్,సుధనపెల్లి ప్రశాంత్,దిలీప్, చిర్ర శ్రీనివాస్, నితిన్ కుమర్, చిర్ర ప్రసాద్,సురేష్,సాంబయ్య, రమేష్, అయిలయ్య, చిర్ర బాబులతో పలువురు ఉన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు పురం శ్రీనివాస్,సర్పంచ్ కావటి వెంకటయ్య,నాయకులు యార బాలకృష్ణ,జున్న రాజు,రౌతు యుగెందర్,వార్డు మెంబర్లు చిర్ర సాంబరాజు, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.