జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లాలో కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గద్వాల భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బల్గెర శివారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తనను గెలిపిస్తే బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ సహకారంతో నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి కలగా మిగిలిన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చర్చించి రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా నాయకురాలు డీకే. అరుణ అండ, ఆమె చేసిన అభివృద్ధి కృషితో 30న జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ జెండాను గద్వాలలో ఎగురవేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి రామాంజనేయులు, వాల్మీకి సంఘం తాలూకా అధ్యక్షులు వైండింగ్ రాములు, ఓబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్, యువ నాయకులు వీరుబాబు, న్యాయవాది పూజారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.