ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఐదు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు.. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. జులై 18 వరకు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ( జులై 15) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం( జులై 18) వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు.. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. హైదరాబాద్‌లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. గంటకు 30- నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని సూచించారు.
ఐఎండీ తెలిసిన ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
సోమవారం ( జులై 15) జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది. అలాగే ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మెరుపులతో కూడిన ఉరుములు, ఈదురు గాలులు ఇతర చోట్ల సంభవించే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లోనూ ఈ జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.