ఓరుగల్లు9నేషనల్ టీవీ :ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, క్రెడ్, అమెజాన్ పే వంటి థర్డ్‌పార్టీ యాప్స్‌తో కరెంటు బిల్లులు, క్రెడిట్‌కార్డు బిల్లులు చెల్లించడం ఇకపై సాధ్యం కాదని ఆర్బీఐ తెలిపింది. బిల్లుల చెల్లింపుల్లో సెక్యూరిటీ కోసం తీసుకొచ్చిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (బీబీపీఎస్)ను ఇవి ఎనేబుల్ చేసుకోకపోవడంతో బిల్లులు కట్టడం కుదరదని తెలిపింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా, జులై 1 నుంచి బీబీపీఎస్‌లో భాగమైన బ్యాంకులకు మాత్రమే క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను అనుమతిస్తామని పేటీఎం తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ సహా కొన్ని బ్యాంకులు బీబీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. ఎస్బీఐ, కోటక్‌మహీంద్రా, ఇండస్ఇండ్, ఫెడరల్ బ్యాంకులు బీబీపీఎస్‌లో చేరాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ఇందులో చేరింది. బీబీపీఎస్ అనేది ఇంటిగ్రేటెడ్ బిల్‌పేమెంట్ ప్లాట్‌ఫారమ్. ఇది మొబైల్ యాప్‌లు, బ్యాంక్ శాఖలు సహా పలు చానెల్స్ ద్వారా బిల్లుల చెల్లింపును అనుమతిస్తుంది. కాగా, ఇక నుంచి థర్డ్‌పార్టీ, పేమెంట్ యాప్స్‌కు బదులు తమ వెబ్సైట్ లేదా యాప్‌ద్వారానే బిల్లులు కట్టాలని తెలంగాణ, ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) వినియోగదారులను కోరాయి