నర్సాపూర్ జి, జూలై 18: ఓరుగల్లు9 నేషనల్ టీవీ, నిర్మల్ జిల్లా
నర్సాపూర్ జి మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్ గ్రామంలో కేంద్ర నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం సభ్యులు ఏ. శ్రీనివాస్ రెడ్డి, నారాయణ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వారు తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి, ఉపాధి హామీ కూలీలు, ఐకేపి (ఇందిరా క్రాంతి పథకం) సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై ఆరా తీయడంతో పాటు, వాటిని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో వారికి వివరించారు.
ఈ సందర్భంగా, టీం సభ్యులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించారు. ఇందులో నర్సరీ, పశువుల పాకల నిర్మాణం, ఇంకుడు గుంతలు, హార్టికల్చర్ ప్లాంటేషన్‌లో భాగంగా ఆయిల్ పామ్ మొక్కల పెంపకం, మరియు అటవీ ప్రాంతంలో చేపట్టిన నిరవధిక కంతకాల ప్రభాకర్ పనులు ఉన్నాయి. ఈ పనుల నాణ్యతపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో వారితోపాటు డిఆర్‌డిఓ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ) కార్యాలయ సిబ్బంది, పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్, మండల ఉపాధి హామీ సిబ్బంది ఏపీఓ జగన్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అనిల్, సాంకేతిక సహాయకులు రవీందర్, సతీష్, క్షేత్ర సహాయకులు డి. నరసయ్య, మేట్ భీమేష్, గ్రామస్తులు, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
నర్సాపూర్ జి మండల కేంద్రంలో ఫిర్యాదులు:
మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో, నర్సాపూర్ జికి చెందిన జాబీర్ అనే వ్యక్తి కేంద్ర బృందం అధికారుల దృష్టికి కొన్ని ఫిర్యాదులు తీసుకొచ్చారు. ఫిష్ పాండ్ పనులను యంత్రాల ద్వారా చేయించారని, ఉపాధి పనుల్లో సెల్ఫీ ఫోటోలు అప్లోడ్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై గత మే 5వ తేదీన కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణికి ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని జాబీర్ గుర్తు చేశారు. 70 రోజులకు పైగా యంత్రాలతో పనులు చేయించి నిధులు దుర్వినియోగం చేసినా పట్టించుకోవడం లేదని అధికారులను నిలదీశారు.

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన రిసిప్ట్ తో