జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ ఎస్ఏ. సంపత్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. శాంతినగర్ క్యాంపు కార్యాలయం నుంచి భారీ వాహన శ్రేణితో అలంపూర్ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్న సంపత్ కుమార్ ఎమ్మార్వో ఆర్వో చంద్రకళకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రపోజర్లుగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ కొంకల నాగేశ్వర్ రెడ్డి, మానవపాడు మండల అధ్యక్షుడు జగన్ మోహన్ నాయుడు, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ సి. రాజు, ఉండవెల్లి మండల అధ్యక్షుడు గోపాల్ తదితరులు ఉన్నారు.