Tuesday, December 24, 2024

ఎమ్మెల్సీ కవితపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు…-ఓరుగల్లు9నేషనల్ టివి

ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. కవిత వల్లే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు అమోదం తెలిపిందని బీఆర్ఎస్ శ్రేణలు చేస్తోన్న కామెంట్లపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ” తెలంగాణ ప్రకటించినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు, అయినా ఆ ఘనత మీదే అన్నట్లు చెప్పుకోవాలని చూడటం హాస్యాస్పదం. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే తానే తెచ్చినట్టు డప్పు కొట్టుకుని జనం చెవుల్లో పూలు పెట్టేది” అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్ఎస్ కృషి ఉందన్నారు కవిత . ఇటీవల మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారన్నారు. బలమైన పార్టీల డిమాండ్‌ వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. మహిళ బిల్లుకు కేంద్రం అమోదంపై ఆమె తన నివాసం వద్ద మహిళలతో కలిసి బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular