ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 03 :
ప్రచురించిన కీచక ఉపాధ్యాయుడి చర్యలు వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు లు సంబంధిత ఉపాధ్యాయులు మనోహర్ రెడ్డి, మోహన్ రావు లతో పాటు పాఠశాల హెడ్మాస్టర్ కిషన్ రావు ను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజాలు నిర్భయంగా రాసే ఓరుగల్లు 9tv డిజిటల్ పత్రికకు పలువురు అభినందనలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులపై తప్పుగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిఇఓ మాట్లాడుతూ విద్యార్థులపై అసభ్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం జరిగిందని, ఇకమీదట ఇలాంటి చర్యలు జరిగితే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
