ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, జనవరి 09 :
నర్సాపూర్ (జి): మండల కేంద్రంలో గురువారం జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా టీయూడబ్ల్యూజే( ఐజేయు) అధ్యక్షులు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సభ్యత్వ నమోదు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత కోసం, హక్కుల కోసం నిరంతరం పోరాడే యూనియన్ టీయూడబ్ల్యూజే, ఐజేయు అని అన్నారు. ఈ జర్నలిస్టుల సభ్యత్వ కార్యక్రమంలో సభ్యులు పున్నం చందు , సుధాగోణ సంతోష్ రామ్ , కడుగొల్ల లచ్చారాం, బాబర్ ఖాన్, జాబీర్ తదితరులు పాల్గొన్నారు