ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, జనవరి 08 :
సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ జి ఎస్ ఐ సాయి కిరణ్ సూచించారు. బుధవారం ఉదయం కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందని, దాంతోపాటే మోసాలు కూడా పెరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తలు అవసరమని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.