ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, జనవరి 8 :
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ హజరత్ శేఖ్ సహాబ్ వలి రహమతుల్లాలై ఉర్సు ఉత్సవాలు ఈనెల 10న శుక్రవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అబ్దుల్ హాది,హబీబ్ ఉల్లా ఖాన్ ,జహీర్,సయ్యద్ అఖ్తర్ తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రసిద్ధ దర్గాలో స్మృతి సమాధి వద్ద ముస్లిం మత పెద్దలు స్థానికులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం గంధం శోభాయాత్రను అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య ప్రారంభించుకొని పట్టణ పురవీధుల గుండా పట్టణ సమీపంలోని మహబూబ్ ఘాట్ లోద్దీకు చేరుకుంటుందన్నారు. 11న రాత్రి పట్టణంలోని ప్రసిద్ధ దర్గా ప్రాంగణంలో చిరాకు కార్యక్రమం తో పాటు జాతర ఉంటుందని తెలిపారు.కులమతాలకు అతీతంగా వేలాదిగా తరలివచ్చే భక్తులు నిర్ణీత సమయాలలో దర్గాకు చేరుకొని హజరత్ వారికి తమదైన రీతిలో నైవేద్యాలను సమర్పించుకుని మొక్కులను తీర్చుకోవాలని వారు కోరారు.