జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్.
ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 10 :
గత రెండు రోజుల నుంచి సామాజిక ఇతరత్రా మాధ్యమాలలో ప్రచారమవుతున్నట్లు దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల రైతులపైకొత్తగా ఎలాంటి కేసులు పెట్టలేదు.
ఆందోళనల నేపథ్యంలో చట్ట ప్రకారం అప్పుడు నమోదైన కేసులే ఉన్నాయి.
వాటికి సంబంధించి అప్పుడే నోటీసులు ఇవ్వటం జరిగింది.
తాజాగా ఆయా గ్రామస్తులపై ఎలాంటి కేసులను నమోదు చేయలేదు.
అప్పుడు కూడా ఎవరి మీద 307 వంటి తీవ్రమైన సెక్షన్ల కేసులు పెట్టలేదు.
కానీ ఈమధ్య కొంతమంది పనిగట్టుకొని ఈ విషయంలో
అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
ఆయా గ్రామస్తులు రైతులను భయాందోళనలకు గురి చేసేలా పుకార్లు సృష్టిస్తున్నారు.ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు.రైతులు, యువకులు మహిళలు ఎవరు కూడా ఇట్టి అసత్య ప్రచారాలతో నమ్మవద్దు, అధైర్య పడొద్దు.కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రజల్లో అశాంతి నెలకొల్పటం కోసం అసత్య ప్రచారాలను పత్రికల్లో కానీ, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.