ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న సోయి వైద్యం మీద లేదు!!
అడ్వకేట్ జగన్ మోహన్
బిఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ.
ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01 :
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో 30 పడకల భవన నిర్మాణ పనులు ఆగిన స్థలమునకు సందర్శించి నిర్మాణ పనులు ఆగిపోవుటకు కారణాలు తెలుసుకున్నారు,ఈ సందర్భంగా జగన్ మోహన్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రి ఆగిన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకున్నదని దీనిని కూల్చివేయాలని అధికారులకు తెలియజేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలోనే నిర్వహించడం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అందులోనే వైద్యులు సేవలు కొన సాగడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు నిరుపేదలు ప్రాణాంతక వ్యాధులను కానీ,విష జ్వరాలను గాని నయం చేసుకొనుటకు, విషసర్పాలు,మూగ జీవుల కాటుకు గురి అయితే వ్యాదులు నయం చేసుకునుటకు వచ్చేది ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు ఆపడం ప్రభుత్వానికి తగదని, ప్రజలను
ప్రభుత్వానికి ఆసుపత్రిలపై నిర్లక్ష్యం తగదని, ప్రత్యేక నిదులు కేటాయించాలని,నిఘా పెంచాలని, ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన వారిలో బీఎస్పీ నియేజక వర్గం ఇంచార్జీ అనిల్ పవార్, నిర్మల్ జిల్లా మహిళా కన్వీనర్ ఎస్.కె లక్ష్మీ యాదవ్. నియేజక వర్గం అద్యక్షులు సునీల్,ముదోల్ మండల అద్యక్షులు గడ్పాలే శ్రీధర్, నాయకులు శివ, మహిల నాయకులు, జ్యోతి,సావిత్రి,రాజేష్ లు పాల్గోన్నారు.