ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 :
నర్సాపూర్ జీ మండల కేంద్రంలో శుక్రవారం సమగ్ర శిక్షా ఉద్యోగులు మండల స్థాయి ధర్నా కార్యక్రమం చేపట్టారు. నర్సాపూర్ జీ మండల SSA ఉద్యోగులు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గత సంవత్సరం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదా లో వరంగల్ ధర్నా కార్యక్రమం లో పాల్గొని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో చాయ్ తాగెంత సమయంలో జిఓ ఇచ్చి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు రెగ్యులర్ చెయ్యలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు చాలి చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మండల స్థాయి లో మండల విద్యా శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించరు. ఈ కార్యక్రమంలో Mis co శ్రవణ్, సీసీఓ స్వప్న, సిఆర్పి వెంకట్ రావు పాల్గొన్నారు.