ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 28:
నర్సాపూర్ మండలం కుస్లి గ్రామానికి చెందిన రేపన్ నాగరావ్ (వడ్డెర) గత కొన్ని రోజుల క్రితం డెంగ్యూతో మరణించడం జరిగింది. రాజుల ఓజవ్వ సాయికుమార్(నాయక పోడు )దంపతుల పాప పుట్టి చనిపోవడంతో సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబాలను సమత ఫౌండేషన్ తరపున ఆదుకుంటామని పేర్కొన్నారు. పరామర్శించిన వారిలో కుస్లీ ఉపసర్పంచ్ సంతోష్ , నాయకులు రవి , ఫౌండేషన్ ఆర్గనైజర్ సాహెబ్ రావు , సలహాదారులు పి.విశ్వనాథ్ , సీఈఓ అనిల్ కుమార్, పిఆర్వో క్రాంతి కుమార్ ,సాయి కృష్ణ , మీడియా ఇన్ఛార్జి శేఖర్ , సామాజిక కార్యకర్త ప్రవీణ్ ,నాయకులు నారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు యోగేష్ , రాజు తదితరులు పాల్గొన్నారు.