ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 :
నర్సాపూర్ జి కేజీబీవీ పాఠశాలకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ప్రత్యేక అధికారి వీణ అన్నారు. విద్యార్థులకు భోజనం అందించేందుకు నిల్వ ఉంచే బియ్యం సంచులు నేలపైన ఉంటే పాడవుతాయని అలా పాడవకుండా ఉండేందుకు 7వ తరగతి విద్యార్థిని అల్లూరి ఆరోహి తల్లిదండ్రులు అల్లూరి రమేష్ – కవిత (కుస్లి గ్రామస్తుడు) రూ.12వేల విలువగల స్టాండును పాఠశాలకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అభినందించారు.