దీక్ష గురు ప్రేమ్ సింగ్ జి మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్న సమత ఫౌండేషన్ చైర్మన్…
ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 26:
సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవతా విలువలే పునాదిగా చేస్తున్న సేవలను సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ జీ మహారాజ్ ఆశీర్వాద నేపథ్యంలో ఫౌండేషన్ సేవలను వివరించారు.ఈ సందర్భంగా సమత సుదర్శన్ మాట్లాడుతు మానవతా బోధనలు ,మానవతా విలువలు దేశ ప్రగతికి ఆదర్శమని మరియు మానవ సేవయే మాధవ సేవ అని పేర్కొన్నారు.దీక్ష గురు ప్రేమ్ సింగ్ జీ సమత ఫౌండేషన్ సేవలను అభినందించారు.ఇందులో చైర్మన్ సమత సుదర్శన్ తో పాటు, ఫౌండేషన్ సభ్యులు,సీఈఓ అనిల్ కుమార్ , ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు యోగేష్ ,నాయకులు శ్రీనివాస్ ,ఉత్తం ,సుధాకర్ ,రాజేష్ , సంతోష్, తండాల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.