ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 25 :
నర్సాపూర్ జి : ఓ మహిళ అదృశ్యం అయిన ఘటన నర్సాపూర్ జి మండలం రాంపూర్ గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్సై హనుమాండ్లు వివరాల ప్రకారం రాంపూర్ గ్రామానికి చెందిన రమ్య అనే మహిళ ఆదివారం సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయానికి బంధువులు పండుగ చేస్తున్నారని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని, ఎంత వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం మహిళ భర్త మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.