ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 23 :
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చౌహన్ నర్సాపూర్ జి మండలకేంద్రానికి చెందిన జడ్పీఎస్ఎస్ పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగింది,నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్.జానకి షర్మిల స్ఫూర్తితో చౌహన్ కృష్ణ కూడా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడం కోసం పదవ తరగతి విద్యార్థులకు 100% ఫలితం తీసుకురావాలని ఆలోచనతో స్కూల్ ని దత్తత తీసుకున్నారు. కృష్ణ చౌహాన్ ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థులకు సహాయం చేస్తూ అదే విధంగా చాలా మందిని ఆర్మీ , పోలీస్ లుగా తీర్చిదిద్దుతున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు. వారు ప్రభుత్వ అధికారులు , ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల వారు విధులు నిర్వహించే ప్రాంతంలో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు, నర్సాపూర్ జి మండలంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. స్కూల్ దత్తత తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నర్సాపూర్ జి మండల MEO కిషన్ రావు లని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ కిషన్ రావు మాట్లాడుతూ వారి పాఠశాలను దత్తత తీసుకోవడం చాలా మంచి ఆలోచన అని విద్యార్థులకు నైపుణ్యాల అభివృద్ధి కోసం తను ఎప్పటికీ సహకరిస్తారని ఒక కానిస్టేబుల్ గా ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప ఆలోచన అని కొని ఆడారు. ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ నా సహాయం ఎప్పటికీ నీకు ఉంటుందని చెప్పారు. కృష్ణ చౌహాన్ ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.