ఆదర్శ సమాజాన్ని నిర్మిద్దాం…
సమత ఫౌండేషన్ ఛైర్మన్ సమత సుదర్శన్…
ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 22 :
నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామంలో మైనారిటీ మిత్రుల ఆత్మీయ కలయికలో ముఖ్యఅతిథిగా సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు సమాజంలో పేదలు, అనాధలు, అభాగ్యులు, వికలాంగులకు సేవ చేస్తూ సమత ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను వివరించారు. మన పరిసర ప్రాంతాల్లో జరిగిన సమస్యలను సమత ఫౌండేషన్ సభ్యులకు తెలియజేయడం ద్వారా సమత ఫౌండేషన్ సత్వరమే స్పందిస్తుందని ,తద్వార సేవా దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆదర్శ సమాజాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం , తైమూరు , వాజిద్ , ఫైజుద్దీన్ , ఇస్సుక్ ,బషీర్ ,అజ్మొద్దిన్ గారు,ఆసిఫ్ , వజిద్ షేప్ , ఖదీర్ , గంగాధర్ గారు,పోశెట్టి , అక్బర్ ,అబ్బాస్ , మహ్మద్ ఆలీ , నిస్సార్ , సమత ఫౌండేషన్ సీఈవో అనిల్ కుమార్ , పీర్ఓ క్రాంతి కుమార్,
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు యోగేష్ ,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.