ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 22 :
నర్సాపూర్ (జీ) మండలం కాంగ్రెస్ ఎస్టి సెల్ మండల అధ్యక్షుడుగా నియమితులైన బూరుగుపల్లి తండాకు చెందిన రాథోడ్ జీవన్ ని సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలకు గాను తగిన గుర్తింపు లభించడం హర్షనీయమని అన్నారు. జీవన్ గిరిజన గొంతుకగా మరెన్నో కీర్తివంతమైన పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు వారితోపాటు ఫౌండేషన్ సీఈవో అనిల్ కుమార్, పిఆర్వో క్రాంతి కుమార్, నాయకులు సాయి కృష్ణ , ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు యోగేష్ తదితరులు పాల్గొన్నారు.