ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 17 :
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సమత సుదర్శన్ నేడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు మహారాష్ట్రలోని నయాగవ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తరపున ప్రచార కార్యక్రమాలు కొనసాగించారు అనంతరం ధర్మాబాద్ చౌరస్తాలో జరిగిన పత్రిక సమావేశంలో ముదొల్ మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి తో పత్రికా సమావేశం నిర్వహించారు సమత సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిందని అదేవిధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని అలాంటి హామీలతోనే తిరిగి మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆయన తెలిపారు. బిజెపి ప్రభుత్వం వారు ప్రజలకు తెలిపిన హామీలు తీర్చకపోగా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీపై. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బిజెపి ఇచ్చిన హామీలను నెరవేర్చి అనంతరం మాట్లాడాలని ఆయన సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న అన్ని పథకాలను మహారాష్ట్రలో అమలు పరుస్తారని సమత సుదర్శన్ తెలియజేశారు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూస్తామని అందుకోసం కష్టపడతామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ముధోల్ మాజీ శాసనసభ్యులు గడ్డిగారి విట్టల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు