అడ్వకేట్ జగన్ మోహన్
బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ.
ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 12 :
నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ…బాసర ఐఐఐటీ లో పియుసి రెండవ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను బాసర త్రిబుల్ ఐఐఐటిని నిర్లక్ష్యము చేసి నారని, 10/10 మార్కులు వచ్చిన విద్యార్థులు గత ప్రభుత్వం 12 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నదని ఆరోపించారు, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడ విద్యార్థుల మరణాలు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఐఐఐటిని సందర్శించాలని డిమాండ్ చేశారు, విద్యార్థుల మరణాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఏమిటి, అనే కోణంలో ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆలోచించాలని అన్నారు. మార్పు కోసం అధికారంలోకి వచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ లో మరణాలు ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు,విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు.ఐఐఐటీ
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తగిన చర్యలు తీసుకోవాలని జగన్ మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.