ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 8 :
శుక్రవారం IDOC లో నార్కోటిక్ కోర్డినేషన్ కమిటి చైర్మన్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, వైస్ చైర్మన్ జిల్లా ఎస్పీ డా.కి.జానకి షర్మిల ఐపిఎస్ లు అన్నీ శాఖల ఉన్నతాదికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మత్తు పదార్థాల నిర్మూలన అక్రమ రవాణా మీద కలెక్టర్ తో చర్చించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలను వినియోగించిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాలలో కళాకారుల ద్వారా మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని సాగుచేసినా, విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గంజాయి వినియోగం కానీ రవాణా గురుంచి వివరాలు తెలిస్తే 1908 లేదా 8712659595 కి కాల్ చేసి తెలియచేసిన వారి సమాచారం వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.
ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్ ఐపిఎస్, డీఎస్పీ గంగారెడ్డి, ఆర్డీఓ, జిల్లా ఎక్సైజ్ అధికారి, ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.