Monday, December 23, 2024

కొనుగోలు కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.-ఓరుగల్లు9నేషనల్ టీవీ

వరంగల్ జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: డిసిసిబి సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సహకార శాఖ అధికారిణి నీరజ  ఆధ్వర్యంలో  కొనుగోలు సెంటర్ల ఇంచార్జీ లకు
2024-25 సంవత్సరం లో నిర్వహించ నున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై  పవర్ ప్రజెంటేషన్  ద్వారా అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ , సివిల్ సప్లై అధికారిని సంధ్యారాణి గార్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు నష్ట పోకుండా రైతులు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామన్నారు
వరి ధాన్యం కొనుగోలు లో గతంలో కంటే ఈ సారి ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ గా 500 చెల్లించే క్రమంలో రైతులు మధ్య దళారులకు అమ్ము కాకుండా ఎక్కువ మొత్తం ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాల పనిచేసి సిబ్బంది ని పెంచుకొని కొనుగోలు సెంటర్లలో వేరువేరుగా సన్న రకం దొడ్డు రకంకు వేరు వేరును ఏర్పాటు చేయడం జరుగుతుందని అందుకు సెంటర్ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 17 శాతం లోబడి ఉన్న  తేమ ధాన్యాన్ని  మాత్రమే కొనుగోలు  చేయాలని, కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాల వల్ల ఏ ఒక్క ధాన్యం గింజ తడవకుండా ఉండేందుకు టార్పాలిన్, ధాన్యాలను తూకం కొలచే యంత్రాలు, తేమశాతం చూసే యంత్రాలు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

   రాష్ట్రవ్యాప్తంగా 33 రకాల సన్న రకాల వరి ధాన్యాలకు గానూ మన  జిల్లాలో  10 నుండి 12 రకాల వరి ధాన్యాన్ని మాత్రమే రైతులు పండించారని,  రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని గుర్తించుటలో ప్రావీణ్యం కలిగి ఉండాలని సెంటర్ ఇన్చార్జిలను ఆదేశించారు.

  రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించి ప్రభుత్వం నిర్దేశించిన  నియమ నిబంధనలను ముందుగానే గ్రామపంచాయతీలలో ,ముఖ్య కూడలిలో, రచ్చబండ లలో టాంటాములు వేయించి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు.

అకాల వర్షాలు వచ్చినట్లయితే ఒక్క దాన్యాయం గింజ కూడా తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందుగానే ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి సమస్య రాకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవలసిన బాధ్యతను కలిగి ఉండాలని ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినట్లు ఐతే గుర్తించుటకు వీలుగా కొనుగోలు కేంద్రానికి ఒక్కొక్క సెంటర్ కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందని, సెంటర్ నెంబర్ ఆధారంగా ఏ సెంటర్లో ధాన్యం సేకరించినట్లు తెలుస్తుందని తెలియజేస్తూ , ప్రభుత్వ నిబంధనల మేరకు తాలు,తేమ శాతం, ఉన్న ధాన్యాన్ని సేకరించాలని అందుకు భిన్నంగా సేకరించిన సెంటర్ ఇంచార్జీ పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అతను కలెక్టర్ సెంటర్ ఇన్చార్జిలను ఆదేశించడమైనది.

ఒక్కొక్క కొనుగోలు సెంటర్ కి ఒక్కొక్క ఐడి నెంబర్ తో పాటు, రైతు  ఐడి నెంబర్ / WGL  అని గన్ని లా పై స్టెన్సిల్ తో  మార్క్ చేయవలసి ఉంటుందని సన్న వడ్ల గన్ని కి  ఎరుపు రంగు దారంతో, దొడ్డు రకం వడ్ల గన్ని కి పచ్చ రంగు దారంతో కుట్టి  వేరు వేరుగా ఉండేలా చూడాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular